భారతీయులకు క్లాస్ పీకిన ప్రభాస్ హీరోయిన్
on Dec 21, 2019

ప్రభాస్ సరసన 'మిర్చి'లో ఓ కథానాయికగా నటించిన రిచా గంగోపాధ్యాయ గుర్తుందా? 'మిర్చి'కి ముందు రానా 'లీడర్', వెంకటేష్ 'నాగవల్లి', రవితేజ 'మిరపకాయ్', 'సారొచ్చారు'తో పాటు 'మిర్చి' తర్వాత నాగార్జున 'భాయ్' సినిమాల్లో నటించింది. మూడు నెలల క్రితం ఎంబీఏలో తన క్లాస్‌మేట్ జాయ్ ను పెళ్లి చేసుకుంది. భారతీయ మీడియా, ప్రేక్షకులకు ఈ సంగతి ఆలస్యంగా తెలిసింది.
సినిమాలు వదిలేసి రిచా గంగోపాధ్యాయ అమెరికా వెళ్లడంతో పెళ్లి చేసుకున్న సంగతి ఎవరికీ తెలియదు. ఆమాటకొస్తే పట్టించుకోలేదు కూడా. పెళ్లి చేసుకుందని తెలిశాక... రహస్యంగా ప్రేమ వివాహం చేసుకుందని అందరూ భావించారు. కానీ, తనది పెద్దల సమక్షంలో ఇండియా, అమెరికా సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగిందని రిచా చెప్పుకొచ్చింది. మళ్ళీ ఇపుడు భారతీయులు అందరికీ క్లాస్ పీకింది. దీనికి కారణం... ఓ విదేశీయుణ్ణి పెళ్లి చేసుకోవడమేంటి? అని చాలామంది కామెంట్ చేశారట. దాంతో ఆమె క్లాస్ పీకింది. అంతే కాదు... అమెరికాను తన ఇల్లు అనుకుంటానని, తాను అమెరికన్ అని చెప్పుకొచ్చింది.
"నాకు మూడేళ్ళ వయసున్నప్పుడు అమెరికా వెళ్లిపోయాం. అప్పటి నుండి అమెరికాలో ఉంటున్నా. 1990 నుండి నేను అమెరికన్ సిటిజన్. నేను ఇండియలో పుట్టినప్పటికీ... అమెరికా నా ఇల్లు అనుకుంటాను. సినిమాల్లో నటించిన ఐదేళ్లు మాత్రమే నేను ఇండియాలో ఉన్నాను. అయితే... అటు అమెరికా, ఇటు ఇండియా సంప్రదాయాల ప్రకారం నేను పెరిగాను. అది నా అదృష్టం అనుకుంటాను. విదేశీయుణ్ణి పెళ్లి చేసుకున్నాననే కామెంట్స్ నాకు అడ్డు తగులుతున్నాయి. ఓపెన్ మైండ్ తో ఉండండి. జీవిత భాగస్వామిని వెతుకోవడానికి పరిమితులు, పరిధులు పెట్టుకోకండి. వేరే సాంప్రదాయంలో పెరిగిన వ్యక్తిలో మీరు కోరుకునే విలువలు ఉండొచ్చు. సిమిలారిటీస్ కలవొచ్చు" అని రిచా గంగోపాధ్యాయ పెద్ద ట్వీట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



