రెట్రో ఫస్ట్ డే కలెక్షన్స్ !
on May 2, 2025

స్టార్ హీరో 'సూర్య'(Suriya)నిన్న మే 1 న వరల్డ్ వైడ్ గా 'రెట్రో'(Retro)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సూర్య(Suriya)సరనస పూజాహెగ్డే(Pooja Hegde)జత కట్టింది. ప్రకాష్ రాజ్, నాజర్, జోజు జార్జ్, బేబీ అవని, జయరాం, కరుణాకరన్, శ్వాసిక, సుజిత్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం తదితరులు నిర్మించగా కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ తొలిరోజు పాన్ ఇండియా వ్యాప్తంగా 19 .25 కోట్ల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. కంగువ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి రెట్రో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో రెట్రో కి వచ్చే డే 1 కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. అలాంటిది 19 కోట్లకి పైగా సాధించి సిల్వర్ స్క్రీన్ పై సూర్యకి ఉన్న స్టామినాని రెట్రో చాటి చెప్పింది. ఒక్క తమిళనాడులోనే 17 .25 కోట్లరూపాయలు రాబట్టింది.
రెట్రో 90 వ దశకం నేపథ్యంలో తెరకెక్కింది. వివిధ రకాల క్యారెక్టర్స్ లో సూర్య చేసిన పెర్ ఫార్మెన్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. కథకి తగ్గట్టే సూర్య ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్లి
చాలా గ్లామరస్ గా ఉన్నాడని, ఆయన క్యారక్టర్ మూవీకే హైలెట్ గా నిలిచిందని చాలా మంది ప్రేక్షకులు అంటున్నారు. 65 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



