విజయవాడ లో ఉన్న ఆవుల్ని, కుక్కల్ని,పిల్లుల్ని కాపాడండి
on Sep 10, 2024

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)మాజీ వైఫ్ రేణు దేశాయ్(renu desai)విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకి సంబంధించి రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె చెప్పిన విషయాలతో తనది ఎంత మంచి మనసో మరోసారి అర్ధమయ్యింది.
విజయవాడ నుంచి నాకు చాలా వీడియోస్ తో పాటు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు తెలిసిన కొంత మంది విజయవాడలోనే ఉండి హెల్ప్ కూడా చేస్తున్నారు. వరదల వల్ల చాలా ఆవులు, పిల్లులు, కుక్కలు ఎక్కడకి వెళ్లాలో తెలియక స్టక్ అయిపోయాయి. గవర్నమెంట్ ఈ విషయం మీద ఫోకస్ చేసి వాటిని సేవ్ చేసే మార్గాల కోసం వెతకాలి. మనుషుల ప్రాణాలకి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి.అదే టైంలో జంతువుల గురించి కూడా ఆలోచించాలి.మనుషులతో పాటు జంతువులకి కూడా హెల్ప్ చెయ్యటం వల్ల మంచి కర్మ ఫలం దక్కుతుందని చెప్పుకొచ్చింది.
అదే విధంగా నాకు వైరల్ ఫీవర్ రావటం వల్ల విజయవాడ కి వెళ్లలేకపోతున్నాను. విజయవాడ లోగాని ఆ చుట్టుపక్కల గాని ఉన్న వాళ్ళు యానిమల్స్ ని ఆదుకోవడానికి ముందుకు రావాలి.మీ సేఫ్టీ ని చూసుకొనే రక్షించండి. ఒక ట్రాక్టర్ గాని వాన్ గాని ఏర్పాటు చేస్తే వాటికీ హెల్ప్ అవుతుందని చెప్పుకొచ్చింది. అలాగే బయట వర్షాల్లో తిరగకండి అని కూడా చెప్పుకొచ్చింది. ఇక రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



