రవితేజ 'పవర్' సెన్సార్ రిపోర్ట్
on Sep 3, 2014

రవితేజ పవర్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. సెన్సార్ జాప్యం వల్ల వాయిదా పడ్డ ఈ సినిమా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్రానికి ’ఎ’ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. పవర్ ఫుల్ ఫైట్స్ తో పాటుగా.. హీరోయిన్స్ రెజీనా, హన్సికాలు ఓ రేంజ్ లో అందాలు ఆరబోశారట. అందుకే పవర్ కు ’ఎ’ సర్టిఫికెట్ కట్టబెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఈనెల 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక చిత్రం విషయానికి వస్తే.. రవితేజ పంధాలో సాగే అన్నీ కమర్షియల్ హంగులున్న ఎంటర్ట్రైనర్ అని సెన్సార్ టాక్. రవితేజ- బ్రహ్మానందం కామెడి ట్రాక్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



