రవితేజకు ఆ పిచ్చి వదల్లేదా?
on May 22, 2015
.jpg)
ఒకానొక దశలో ఫుల్ క్రేజ్ ఉంది కదా అని మాస్ మహారాజ్ రెచ్చిపోయాడు. వరుస ఆఫర్లు, ఫుల్లుగా డబ్బులు వస్తే చాలనుకున్నాడు. దీంతో కథపై దృష్టిపెట్టడం మానేశాడు. ఫలితం అనుభవించాడు. వరుస సినిమాలు వచ్చాయే కానీ ఒక్కటీ సరైన హిట్ లేదు. ఇక రవితేజ కెరీర్ క్లోజ్ అనే ప్రచారమూ జరిగింది. ఇంతలో కొంత గ్యాప్ తర్వాత వచ్చిన బలుపు హిట్టవడం వెంటనే ఏ ప్రాజెక్ట్స్ కు సైన్ చెయ్యక పోవడంతో కాస్త మారాడులే అనుకున్నారు. కానీ అంతలేదని మళ్లీ ఝలక్ ఇచ్చాడు మాస్ హీరో. డబ్బులిస్తే చాలు ఫ్లాప్ దర్శకుడైనా ఓకే అంటున్నాడట. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే సుధీర్ వర్మకి ఓకే చెప్పేస్తా అంటున్నాడట. దీంతో రవికి డబ్బు జబ్బు వదల్లేదని ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



