ఇద్దరిదీ ఒకే స్థితి.. ఏమిటి ఈ పరిస్థితి...
on Nov 22, 2025

ఇద్దరిదీ ఒకే పరిస్థితి
వరుస ఫ్లాప్స్ లో రవితేజ, నరేష్
ఎలాంటి సినిమాలు చేయాలనే సందిగ్ధం
మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్.. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న హీరోలు. ప్రేక్షకులను ఎంతగానో అలరించి, ఎన్నో విజయాలు చూశారు. కానీ, కొంతకాలంగా వరుస పరాజయాలు చూస్తున్నారు. దాంతో అసలు ఏ తరహా సినిమాలు చేయాలనే సందిగ్ధంలో పడిపోయారు. ఓ రకంగా ఇప్పుడు రవితేజ, నరేష్ ఇద్దరిదీ ఒకే పరిస్థితి.
ఒకప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రెస్ లా రవితేజ ఉండేవాడు. ఆ జానర్ లో పలు సినిమాలు చేసి, బ్లాక్ బస్టర్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తే.. ఇంకెంత కాలం అవే రొటీన్ సినిమాలు అంటున్నారు. విభిన్న జానర్ లో సినిమాలు ప్రయత్నిస్తే.. ఆదరించట్లేదు. దీంతో ఎలాంటి సినిమాలు చేయాలో అర్థంకాని సిచువేషన్ లో పడిపోయాడు.
రవితేజ లాగే నరేష్ ది కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఒకప్పుడు కామెడీ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్నాడు. కానీ ఇప్పుడు టీవీలు, ఫోన్లలో అంతకుమించిన కామెడీ దొరుకుతుండటంతో.. ఆ తరహా కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. అందుకే నరేష్ రూట్ మార్చి.. విభిన్న జానర్స్ లో సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే, ఇవి కూడా పెద్దగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవట్లేదు. దీంతో రవితేజ లాగే ఏ తరహా సినిమాలు చేయాలనే సిచువేషన్ లో పడిపోయాడు నరేష్.
Also Read: 12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ
అయితే సినీ అభిమానులు మాత్రం ఇద్దరికీ ఒకటే సలహా ఇస్తున్నారు. జానర్ తో సంబంధం లేదు. ఏ జానర్ సినిమా అయినా.. కంటెంట్ బాగుంటే ఆదరణకు నోచుకుంటుంది. రీసెంట్ గా రవితేజ మాస్ జాతర అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు.. కానీ, కంటెంట్ మెప్పించలేదు. ఇక నరేష్ తాజాగా '12A రైల్వే కాలనీ' అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో పలకరించగా.. కంటెంట్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
టాలెంటెడ్ హీరోలైన రవితేజ, నరేష్.. జానర్ మీద కాదు, కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి. సినిమాలలో విషయం ఉంటే.. విజయాలు వాటంతట అవే వస్తాయి. మరి తదుపరి సినిమాలతోనైనా ఈ ఇద్దరు కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



