రవితేజ తండ్రి మరణంపై చిరంజీవి స్పందన.. చివరిసారిగా కలిసింది అక్కడే
on Jul 15, 2025

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao).బి. సరోజాదేవి(B. Sarojadevi)మరణ వార్తలు మరువకముందే.. ప్రముఖ కథానాయకుడు రవితేజ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు(90) కన్నుమూశారు. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
రాజగోపాల్ రాజు మరణంపై మెగాస్టార్ చిరంజీవి(Chirajeevi)స్పందిస్తు సోదరుడు రవితేజ(Ravi Teja)తండ్రి రాజ గోపాల్ రాజు (Raja Gopal Raju)గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. రవి తేజ చిరంజీవికి కలిసి అన్నయ్య, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు కాగా.. రవితేజ పెద్ద కుమారుడు. మరో ఇద్దరు కుమారులు రఘు, భరత్ కూడా నటులే. అయితే 2017 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ మరణించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



