'ధమాకా' దర్శకుడితో మాస్ రాజా మరో సినిమా!
on Jun 21, 2023

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'రావణాసుర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, అక్టోబర్ లో 'టైగర్ నాగేశ్వరరావు'తో సందడి చేయనున్నారు. మరోవైపు 'ఈగల్' అనే మరో సినిమా చేస్తున్నారు. వీటికి తోడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాలుగో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక తాజాగా తనకు 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రినాథరావు నక్కినతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదుర్కొన్న రవితేజకు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన 'ధమాకా' బ్లాక్ బస్టర్ అందించింది. కామెడీ, సాంగ్స్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. మాస్ ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టేలా చేసిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ 'ధమాకా' కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రెండో సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇది కూడా 'ధమాకా' తరహాలోనే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని, ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారని వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



