డైరెక్టర్ రమేష్ వర్మ మహర్జాతకుడు!
on Feb 10, 2022

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఖిలాడి'. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఫిబ్రవరి 11) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ డైరెక్టర్ రమేష్ వర్మని మహర్జాతకుడు అని అన్నారు.
"ప్రస్తుత పరిస్థితులను తక్కువ మంది తమ్ముళ్ళని(ఫ్యాన్స్ ని) కలిశాం. ఈసారి మొత్తం అందరం కలుద్దాం. వెన్నెల కిషోర్, రావు రమేష్ వంటి వారితో కలిసి నేను గతంలో నటించాను. మొదటి సారి అనసూయ, అర్జున్ గారితో నటించడం. అర్జున్ గారు ఇన్స్పిరేషన్. వీరు అందరితో నటించడం సంతోషంగా ఉంది. నేను జాతకాన్ని, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. కానీ రమేష్ వర్మని చూశాక నమ్మకం శాతం కొంచెం పెరిగింది. రమేష్ వర్మ జాతకానికి, అదృష్టానికి చిరునామా కోనేరు సత్యనారాయణ గారు. ఇంతమంచి యాక్టర్స్, టెక్నీషియన్స్ ని ఇచ్చారు, సినిమా రిలీజ్ కి ముందే కారు గిఫ్ట్ చేశారు. అందుకే రమేష్ వర్మ మహర్జాతకుడు అని నేను అనుకుంటున్నాను."
" చాలా గ్యాప్ తర్వాత దేవిశ్రీప్రసాద్ నా సినిమాకి పని చేశాడు. ఎప్పటిలాగే నాకు మళ్ళీ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక మా కాంబినేషన్ కి గ్యాప్ రాదు. మీనాక్షి, డింపుల్ లకు మంచి టాలెంట్ ఉంది. ఇద్దరూ మంచి స్టార్స్ అవుతారు. సినిమా చాలా బాగా వచ్చింది. నేను యాక్టర్ గా సినిమా చూడను. మీలో ఒకడిగా(ప్రేక్షకుడిగా) సినిమా చూస్తాను. అందుకే చెప్తున్నాను. ఈ సినిమా నాకు నచ్చింది. మీక్కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను."
"నేను ఈ సినిమాకి ఒప్పుకోడానికి ఇద్దరు ప్రధాన కారణం. ఒకరు శ్రీకాంత్ విస్సా. రెండు కోనేరు గారు. శ్రీకాంత్ పుష్ప డైలాగ్ రైటర్. నేను ఈ సినిమా చేయడానికి ఇతనే మెయిన్ రీజన్. సీన్స్ డైలాగ్స్ బాగా రాశాడు. ఇతను స్టొరీ చెప్పడం వల్లే ఈ సినిమా ఒప్పుకున్నాను. శ్రీకాంత్ కి మంచి భవిష్యత్ ఉంది. మా ఇద్దరి కాంబినేషన్ లో వరుసగా సినిమాలు చేస్తాం. శ్రీకాంత్ లాంటి మంచి వ్యక్తిని, టాలెంటెడ్ పర్సన్ ని పరిచయం చేసినందుకు రమేష్ వర్మకి థ్యాంక్స్" అని రవితేజ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



