ఛాన్సుల కోసం హీరోలతో పడుకోలేదు!
on Aug 5, 2020
బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాల్లో ఛాన్సుల కోసం తానేప్పుడూ హీరోలతో పడుకోలేదని లేటెస్టుగా ఒక వెబ్ పోర్టల్‌కి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. అలాగే, హీరోలతో ఎఫైర్లు పెట్టుకోలేదని అన్నారామె. గాడ్ ఫాదర్లు లేకుండా, క్యాంపు రాజకీయాలలో పార్టిసిపేట్ చేయకుండా సినిమాలు చేశానని రవీనా టాండన్ వ్యాఖ్యానించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ తరవాత నెపోటిజమ్, బాలీవుడ్ క్యాంప్స్, గ్రూప్ పాలిటిక్స్ గురించి డిస్కషన్ జరుగుతోంది. వాటిని ప్రస్తావించకుండా తాను హీరోయిన్గా నటించినప్పుడు అటువంటివి ఉన్నాయని రవీనా టాండన్ అనడం గమనార్హం. ముఖ్యంగా ఫీమేల్ జర్నలిస్టుల మీద ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. హీరోలకు చెంచాగిరి చేస్తూ తనపై చెత్త వార్తలు రాశారని ఆమె అన్నారు. ఇప్పుడు వాళ్లంతా ఫెమినిస్టులుగా చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. హీరోల అడుగులకు మడుగులు ఒత్తనప్పటికీ, నిజాయతీగా ఉన్నప్పటికీ అవకాశాలు కోల్పోలేదనీ... తనకు పేరున్న దర్శకులతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయని రవీనా టాండన్ తెలిపారు.