స్వర్ణ దేవాలయంలో రష్మిక..సిక్కుల ఆచారాలు తెలుసుగా
on Feb 11, 2025
.webp)
'ఛత్రపతి శివాజీ మహారాజ్' తనయుడు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'చావా'(Chhaava).ఈ నెల 14 న విడుదల కాబోతున్న ఈ మూవీలో 'శంభాజీ మహారాజ్' క్యారక్టర్ ని 'విక్కీ కౌశల్'(Vicky kaushal)పోషించగా,ఆయన భార్య యేసుబాయిగా 'రష్మిక మందన్న'(Rashmika Mandanna)కనిపిస్తుంది. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో అందరిలో అంచనాలు పెరిగాయి.
రీసెంట్ గా రష్మిక అమృతసర్ లోని సిక్కుల పవిత్ర పుణ్య క్షేత్రమైన స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది.విక్కీ కౌశల్ తో పాటు చిత్ర బృందం తో కలిసి వెళ్లిన రష్మిక స్వర్ణ దేవాలయంలో పూజలు చేసింది.ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో పాటు,స్వర్ణ దేవాలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని ,'చావా' ఘన విజయం సాధించాలని కోరుకున్నానని తెలిపింది.
'చావా'ని మాడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేష్ విజన్(Dinesh Vijan)అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా లక్ష్మణ్ ఉటేకర్(laxman Utekar)దర్శకుడుగా వ్యవహరించాడు.అక్షయ్ కన్నా,అశుతోష్ రానా,దివ్యదుత్త,వినీత్ కుమార్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.మూవీలోని కొన్ని సీన్స్ తో పాటు డైలాగ్స్ కి సెన్సార్ బోర్డుతో పాటు పలు హిందూ సంఘాలు అభ్యంతరాలు చెప్పడంతో,వాటిని చిత్ర బృందం మ్యూట్ చెయ్యడంతో పాటుగా కొన్నింటిని తొలగించడం జరిగింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



