The Girlfriend Trailer: ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్.. ఏడిపించేసిన రష్మిక!
on Oct 25, 2025

రష్మిక మందన్న (Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. రష్మిక, దీక్షిత్, అను పాత్రల మధ్య ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఓ డిఫరెంట్ లవ్ స్టోరీలా టర్న్ తీసుకుంది. పాత్రలను మలిచిన తీరు, ఆ పాత్రల మధ్య భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. 'ది గర్ల్ ఫ్రెండ్'తో ఓ ఎమోషనల్ రైడ్ ని చూడబోతున్నామని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. "విరాట్ కోహ్లీరా ఇక్కడ.. నా అనుష్క అక్కడుంది" అంటూ రష్మికను చూపిస్తూ దీక్షిత్ చెప్పే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ లో ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ లు, ఎమోషన్స్, మ్యూజిక్ ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రష్మిక ప్రధాన హైలైట్ గా నిలిచింది. పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న రోల్ చేసింది. ట్రైలర్ లోనే ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించింది. నటిగా రష్మికకు ఈ సినిమా గొప్ప పేరు తీసుకురావడం ఖాయమనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



