రష్యా నుంచి సెల్ఫీ షేర్ చేసిన రష్మిక! 'క్యూట్' అని కామెంట్ చేసిన సామ్!!
on Feb 9, 2022

రష్మిక మందన్న రష్యాకు వెళ్లింది. ఆమె ఇప్పటికే ఆ దేశాన్ని ఇష్టపడుతోంది. ఈ 'పుష్ప' హీరోయిన్ అందమైన పింక్ స్వెట్‌షర్ట్‌ని ధరించి తీసుకున్న మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది. మనోహరమైన ఆ ఫోటోకు, “#రష్యాలో నా మొదటి రోజు కోసం సిద్ధంగా ఉన్నాను” అని క్యాప్షన్ ఇచ్చింది రష్మిక. ఈ పోస్ట్‌పై సమంత రూత్ ప్రభు 'క్యూట్' అని కామెంట్ చేసింది. ఇది వర్క్ ట్రిప్పా లేదా సాధారణ విహారయాత్రా అనే విషయం తెలియదు. కానీ రష్యాలో రష్మిక మరికొన్ని గ్లింప్సెస్ చూడ్డానికి మనం ఎదురుచూస్తుంటామనేది నిజం.
మంచుతో నిండిన రష్యా నుండి ఫోటోగ్రాఫ్‌లను పంచుకుంటున్న మరో హీరోయిన్ రాశీ ఖన్నా. ఆమె నాగ చైతన్యతో కలిసి తన రొమాంటిక్ కామెడీ 'థ్యాంక్యూ' షూటింగ్‌లో ఉంది. ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. Also read: యువకుడిని కాపాడిన సోనూసూద్.. రియల్ హీరోపై ప్రశంసలు!
కొద్దిసేపటి క్రితం, రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా , తన బొచ్చు కుక్కపిల్ల ఆరాతో విస్మయపరిచే ఫొటోను పంచుకుంది. దానికి “ఆమె లేకుండా నేనేం చేస్తాను” అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటోలో రష్మికను ఆరా ముద్దుపెట్టుకుంటోంది. గుర్తుండిపోయే క్లిక్‌కి పోజులివ్వడంతో ఇద్దరూ అందంగా కనిపిస్తున్నారు. Also read: రాజశేఖర్ `ఎవడైతే నాకేంటి?`కి 15 ఏళ్ళు!
కాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించే 'RC16'లో హీరోయిన్‌గా రష్మిక పేరు బలంగా వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ, ఆమె మరో ప్రాజెక్ట్‌ను కైవసం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ రేసీ డ్రామాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



