లక్కీ మంత్‌లో రష్మిక హ్యాట్రిక్ ఎటెంప్ట్
on Jan 21, 2021

చూసీ చూడంగనే తెలుగువారికి నచ్చేసిన చందనసీమ సోయగం.. రష్మిక మందన్న. ఛలోతో తెలుగు తెరకు పరిచయమైన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో ఇక్కడి వారికి మరింత చేరువైంది. ప్రస్తుతం ఈ అమ్మడు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప, యువ కథానాయకుడు శర్వానంద్ తో ఆడాళ్ళూ మీకు జోహార్లు చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి.
ఇదిలా ఉంటే.. రష్మిక నటించిన తాజా కన్నడ చిత్రం పొగరు ఫిబ్రవరి 19న విడుదలకు సిద్ధమైంది. ధృవ సర్జా హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ అదే రోజున థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రష్మికకి ఫిబ్రవరి లక్కీ మంత్ అనే చెప్పాలి. ఈ నెలలోనే వచ్చిన ఛలో (2018), భీష్మ (2020) బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్నాయి. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయి పొగరు కూడా తెలుగు, కన్నడ భాషల్లో విజయం సాధించి.. తనకి ఫిబ్రవరి నెల పరంగా హ్యాట్రిక్ ని అందిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



