ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యింది.. ఫస్ట్ మూవీ బయటకు రాలేదు..
on Nov 9, 2025

రష్మిక మందన్న అంటే చాలు ఇండస్ట్రీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న హీరోయిన్. ఏ రోల్ ఐనా కానీ చిటికెలో చేసేస్తుంది. అలాంటి రష్మిక జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి వచ్చి జగపతిబాబుతో కూర్చుని ఆడిషన్స్ లో ఎలా రిజెక్ట్ అయ్యిందో చెప్పింది. (Rashmika Mandanna)
"నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో వద్దన్నారు. అప్పుడే అడిగాను ఎందుకు వద్దంటున్నారు అని. ఐతే ఇండస్ట్రీలో సపోర్ట్ సిస్టం అంటూ ఎవరూ లేరు. ఇండస్ట్రీ విధానం వేరు అని చెప్పారు. ఇండస్ట్రీలో నేను మనగలలేను అని వాళ్ళు భయపడ్డారు.
నేను బెంగుళూరులో డిగ్రీ చదువుతూ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. అప్పుడు మా పేరెంట్స్ వద్దు తిరిగి వచ్చేయి అన్నారు. అలా చదువుతున్నప్పుడే నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడు ఒకటి అర్ధమయ్యింది. నా ఫీచర్స్ కానీ నా ఫిజిక్ కానీ సినిమా వరల్డ్ సెట్ కాదు అన్న విషయం రెండు మూడు ఆడిషన్స్ ఇచ్చాక అర్ధమయ్యింది. ఒక మూవీ రిజెక్ట్ అయ్యింది. తర్వాత ఒక మూవీకి సెలెక్ట్ అయ్యాను. అందులో సిక్స్ యాక్టర్స్ ఉన్నారు. అంతా కొత్త వాళ్ళే ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. అదొక కాలేజీ స్టోరీ. దాని పేరు గెలేరే-గెలిథియరే..ఐతే ఈ మూవీ కోసం ఒక మూడు నాలుగు నెలలు రిహార్సల్స్, ప్రేపరేషన్స్ చేస్తూ ఉన్నాను. మధ్యలో కాలేజీ, ఎగ్జామ్స్ కి వెళ్తూ ఉండేదాన్ని. ఐతే తర్వాత ఆ మూవీ ముందుకు వెళ్లాలేదు. దానికి ఏవో ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ వలన ఆ మూవీ బయటకు రాలేదు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు నాకు కిరిక్ పార్టీ మూవీ కోసం కాల్ వచ్చింది. ఐతే ముందు భయం వేసింది. ఆడిషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ మూవీ రాలేదు. ఈ మూవీ పరిస్థితి ఏమిటా అనుకునేదాన్ని. షూటింగ్స్ చేయడం, తర్వాత ఎగ్జామ్స్ వెళ్లి రాసేదాన్ని. అలా ఫైనల్ గా నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను . ఇదంతా జరిగింది నా కాలేజ్ ఫ్రెండ్స్ కారణంగానే." అని చెప్పింది రష్మిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



