హైదరాబాద్‌లో రష్మిక రౌడీ జిమ్... విజయ్ జగపతి అని పేరు మార్చుకుంటా!
on Nov 7, 2025

జయమ్ము నిశ్చయమ్మురా లేటెస్ట్ ప్రోమోలో మెరిసింది రష్మిక. రాగానే జగ్గు భాయ్ చాలా ఇంటరెస్టింగ్ క్వశ్చన్స్ వేశారు. "నీ అల్లరి పనులు కొన్ని చెప్పవా మాకు తెలియట్లేదు" అన్నారు. "వద్దండి. ఇప్పుడు చెప్పేస్తే తర్వాత ఏసుకుంటారు" అంటూ ఫన్నీగా చెప్పింది. "నీ లాస్ట్ టెక్స్ట్ ఎవరికీ చేసావ్" అని అడిగారు. "మాట్లాడాలి దీని గురించి" అని చెప్పింది. "మీకేరికన్నా నన్ను కలవాలని అనిపిస్తే అందరూ జిమ్ కి వచ్చేయండి" అని చెప్పింది రష్మిక. "జిమ్ వచ్చేయండి అనడం తేలిక. కానీ ఏ జిమ్ ఏ టైం అని చెప్పాలి కదా" అని అడిగారు జగ్గు భాయ్. "హైదరాబాద్ లో ఐతే" అని రష్మీక అనేసరికి "రౌడీ జిమ్ ఒకటి" అని ఆన్సర్ ఇచ్చారు జగ్గు భాయ్. "రౌడీ జిమ్ అని స్టార్ట్ చేయాలండీ" అని చెప్పింది రష్మిక. "నేనే ట్రైన్ చేస్తా మిమ్మల్ని.." అని ఆడియన్స్ కి చెప్పింది.

"చాలా అందమైన పేరు నీది. దాన్ని అటు చేసి ఇటు చేసి క్రష్ చేసేసారు. నీ క్రష్ ఎవరు" అని డైరెక్ట్ గా అడిగేసారు జగపతి బాబు. ఆడియన్స్ ఎవరు అని కళ్ళతో సైగ చేసింది. "మీ అండర్ స్టాండింగ్ ఆ అది..మాకు చెప్పరా" అని అడిగారు. "ఫిల్ ఇన్ ది బ్లాంక్ చేసుకోండి" అని రష్మిక. "ఒకే ఒక్క బ్లాంక్ ఉంది" అన్నారు జగపతి బాబు. "ఒక్కళ్ళే చెప్పాలంటే" అని మళ్ళీ అడిగారు. "విజయ్ అని ఎవరైనా ఉన్నారా పేరు" అని రష్మిక ఆడియన్స్ ని అడిగింది. "నేను పేరు మార్చుకుంటా విజయ్ జగపతి అని " జగ్గు భాయ్ చెప్పేసరికి క్యూట్ గా ఆన్సర్ చెప్పకుండా నవ్వేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



