స్టార్ హీరోయిన్స్‌పై చెలరేగిన రష్మీ
on Mar 14, 2016

ఒకట్రెండు సినిమాలు చేసిందో లేదో గానీ... సినిమా పరిశ్రమనంతటికీ ఔపాశన పట్టినట్టు మాట్లాడుతోంది రష్మి. ఆఖరికి స్టార్ హీరోయిన్లపై విరుచుకుపడిపోవడానికి కూడా సిద్ధమైంది. 'ఆ గుంటూరు టాకీస్‌లో నీ ఎక్స్‌పోజింగేంటి? ఆ ఎంగిలి ముద్దులేంటి రేష్మీ?' అని అడిగితే.. కస్సుమని పడిపోతోంది. ''ఏం... ముద్దులు పెట్టుకొంటే తప్పా? హాట్ హాట్ గా కనిపించాలంటే ఎంత కష్టపడాలో తెల్సా'' అంటూ లెచ్చర్లు దంచి కొడుతోంది. తెరపై రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదట. పాత్రపై డెడికేషన్ ఉన్నప్పుడే అలాంటి సీన్లు పండుతాయట.
ఇదీ.. రష్మీ సిద్దాంతం. అక్కడితో ఆగిపోలేదు ఈ హాట్ యాంకర్ భామ. ''మరి స్టార్ హీరోయిన్లంతా చేస్తోంది ఏమిటి? కోట్లు కోట్లు తీసుకొని ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పులేనిది, నేను చేస్తే తప్పా?'' అంటూ నిలదీస్తోంది. అంటే ఎక్స్‌పోజింగులూ, లిప్‌లాక్ కిస్సులూ ఏమాత్రం తప్పుకాదన్నది రష్మీ నమ్మకం కాబోసు. ఆ మాట చెప్పొచ్చుగా.. మిగిలిన హీరోయిన్లను ఆడిపోసుకోవడం ఎందుకు?? వాళ్లని ఏదో ఒకటి అంటేగానీ.. పబ్లిసిటీ రాదని బెంగ పడుతుందేమో మరి. గుంటూర్ టాకీస్ తో రావల్సిన క్రెడిడ్, క్యాష్ ఎలాగూ వచ్చేసింది కదా? ఇంకెందుకూ ఈ లేనిపోని కామెంట్లు??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



