నియమాల్లేవ్ అంటున్న జిల్ పిల్ల!
on Jun 4, 2015
నాకైతే నియమాలేమీ లేవు....అయినా కాస్త ఎక్స్ పీరియన్స్ వచ్చాక కదా ఏది మంచో ఏది చెడో తెలిసేది. అందుకే దూకుడు మీదున్నా అంటోందట రాశిఖన్నా. ఇంతకీ ఈ మాట ఎందుకందబ్బా అని ఆరాతీస్తే... జిల్ మనిపించేలా ఉండే రాశిఖన్నా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. మరికొన్ని ఆఫర్స్ కూడా రావడం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందంటోంది. అది సరే తీరు తెన్నూ లేకుండా వరుసగా మూవీస్ చేసేస్తున్నావ్? ప్రూవ్ చేసుకోవాలని లేదా ఆ సమాధానం చెప్పిందట. ఇలా వచ్చామో లేదో అప్పుడే ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయంలోనే ఉంటే ఆఫర్స్ ఇచ్చేది ఎవరు అంటోందట. పైగా వరుసగా ఓ డజను క్యారెక్టర్స్ చేస్తే కదా మన ఒంటికి ఏ క్యారెక్టర్స్ నప్పుతాయి? ఎందులో మనం బాగా నటిస్తున్నామో? అని ఫిలాసిపీ చెబుతోందట. ఆ విషయంపై క్లారిటీ రాగానే క్యారెక్టర్స్ ఎంపికలో పరిమితులు మొదలవుతాయి అందట. జిల్ పిల్ల తెలివితేటలు చూసి అవాక్కయ్యారంతా. మొత్తానికి చిన్నదానికి ఇండస్ట్రీలో మంచి ఫ్యూచరే ఉందంటున్నారు. ఓ సినిమాలో నటించి బిల్డప్ ఇచ్చే ముద్దుగుమ్మలు కాస్త నేర్చుకుంటే మంచిదంటున్నారంతా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
