మహేష్‌కి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న రాశీఖన్నా!
on Feb 19, 2023
.webp)
ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటి రాశీఖన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా, పాత్రల పేర్లతోనే గుర్తుండిపోయే నటి రాశీఖన్నా. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం అన్నది రాశీఖన్నా చెబుతున్న మాట. హిందీ, తమిళ్, తెలుగులో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది రాశీఖన్నాకి.ఈ 30 ఏళ్ల నటి తొలి తెలుగు చిత్రం శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే. ఇందులో నాగశౌర్యకు జోడీగా నటించారు రాశీఖన్నా. అప్పటి నుంచీ మెట్టుకు మెట్టూ ఎదుగుతూ స్టార్ హీరోల సినిమాల్లో నటించి, పెద్ద ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నారు. నాగచైతన్య, రవితేజ, సాయిధరమ్‌తేజ్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, జూ.ఎన్టీఆర్, వరుణ్ తేజ్, నితిన్, విజయ్ సేతుపతి, పృథ్విరాజ్ సుకుమారన్, ధనుష్‌తో జోడీ కట్టేశారు రాశీఖన్నా. ఇంత మందితో నటించినప్పటికీ ఆ ఒక్క కోరికా మిగిలిపోయిందంటున్నారు రాశీ.
ఇంతకీ ఏంటని అడిగితే ``మహేష్‌తో నటించడం`` అని ఆన్సర్ చేశారు.
మహేష్ గురించి మాట్లాడుతూ ``నాకు మహేష్‌బాబు అంటే చాలా ఇష్టం. ఆయన సెలక్ట్ చేసుకునే కేరక్టర్లు పెక్యులియర్‌గా ఉంటాయి. ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు కూడా మంచి స్పేస్ ఉంటుంది. నాక్కూడా ఆయన సినిమాలో నటించాలని ఉంది. త్వరలోనే నా కల నెరవేరుతుందని భావిస్తున్నాను`` అని అన్నారు.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో సెకండ్ లీడ్‌గా రాశీఖన్నా పేరు వినిపిస్తోంది. హీరోయిన్ గా ఆల్రెడీ జాన్వీ కపూర్ పేరు వైరల్ అవుతోంది. అయితే ఈ ఇద్దరికీ సంబంధించి ఇంకా అఫిషియల్ క్లారిఫికేషన్ అయితే రాలేదు.ఇటీవల ఆమె నటించిన వెబ్ సీరీస్ ఫర్జి విడుదలైంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన ఫర్జిలో ఆర్‌బీఐ ఆఫీసర్‌గా నటించారు రాశీ ఖన్నా. గతంలో రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అనే వెబ్‌సీరీస్‌లోనూ నటించారు.
ఆమె హీరోయిన్‌గా హిందీలో యోధ అనే సినిమా తెరకెక్కుతోంది. దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



