ప్రముఖ గాయనీమణి మృతి.. తొలి తెలుగు పాట ఆమెదే
on Oct 15, 2025

పాట తన యొక్క మాధుర్యాన్నిప్రేక్షకులకి పంచడానికి తన వరప్రసాదంగా కొంత మందిని భూమ్మీదకి పంపిస్తుంది. అలాంటి వాళ్ళల్లో 'రావు బాలసరస్వతి దేవి'(Rao Bala Saraswathi devi)గారు ఒకరు. పాటకి ఆమె వల్లే పేరు వచ్చిందని కూడా చెపుకోవచ్చు. ఆ గాత్ర మాధుర్యం వింటే మనుషులే కాదు ప్రకృతి సైతం పరవశించిపోతుంది. ఎంటైర్ దక్షిణ చలన చిత్ర పరిశమ్రలోనే మొట్టమొదటి గాయనీమణి కూడాను. రేడియోలు రాజ్యమేలుతున్న కాలంలో తెలుగు ఆకాశవాణిలో వచ్చిన మెజారిటీ పాటలన్ని ఆమెవే. తెలుగు సినిమాకి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆమె సొంతం.దీంతో 'లలిత సంగీత సామ్రాజ్ఞి' గా పేరు గడించింది. తొలి తెలుగు సోలో గ్రామ్ ఫోన్ ఫోన్ రికార్డు కూడా ఆమెదే.
ఈ రోజు ఉదయం 'రావు బాలసరస్వతి దేవి గారు భువి నుంచి దివికి చేరారు. పాటని, లలిత సంగీతాన్ని తన అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచుతు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు కాగా వృద్దాప్య సమస్యల వల్లనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటకి సంబంధమున్న ప్రతిఒక్కరు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆరవ యేట నుంచే పాటలు పాడటంలో ప్రావిణ్యం సంపాదించిన బాలసరస్వతి దేవి గారు 1939 లో వచ్చిన మహానంద అనే సినిమాలో మొదటి సారిగా ఆలపించారు.
సతీఅనసూయ, ఇల్లాలు, పరమానందయ్య శిష్యుల కథ, లైలా మజ్ను, షావుకారి, పిచ్చి పుల్లయ్య, తెనాలి రామకృష్ణ, దాంపత్యం ఇలా పలు చిత్రాల్లోని పాటలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. సుదీర్ఘ కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ కలుపుకొని సుమారు 2000 పాటల వరకు పాడారు. 1928 ఆగస్ట్ 28 న జన్మించగా, స్వస్థలం గుంటూరు. ఆమె తన చివరి ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ గాయనిగానే పుడతానని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



