సమంత పుణ్యమా అని దసరా పోయి సంక్రాంతి వచ్చే డాం డాం డాం
on Jun 10, 2017
.jpg)
ఈ సంవత్సరం దసరా రేస్ లో ఉన్న మొదటి సినిమా రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985. కానీ, నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నిర్మాతలు తమ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం అని ప్రకటించారు. మొదట దసరాకి కాకపోయినా ఒక నెల అటు, ఇటుగా వస్తుందని అందరూ భావించారు. కానీ, ఈ సంవత్సరం ఈ సినిమాని విడుదల చేయడం కుదరకపోవొచ్చని, అందుకే సంక్రాంతి లాంటి మెగా పండగకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ, రంగస్థలం 1985 పోస్టుపోన్ అవ్వడానికి ప్రధాన కారకులు ఎవరో తెలుసా. ఇంకెవరు, ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సమంత.
నాగ చైతన్య తో అక్టోబర్ 6కి పెళ్ళికి సిద్ధం అవుతున్న సమంత, తన అన్ని సినిమాల దర్శక, నిర్మాతలకి రెండు నెలలు షూటింగ్ కి రావడం కుదరదని చెప్పిందట. వీలయితే, ఆగష్టు లోపల పనులన్నీ అయిపోయేలా చూసుకోమని, లేదంటే నవంబర్ వరకు ఆగమని చెప్పిందట. రంగస్థలం 1985 దర్శక, నిర్మాతలు సమంత వచ్చినన్ని రోజులు షూటింగ్ చేసి, తర్వాత రామ్ చరణ్ పోర్షన్స్ కంప్లీట్ చేసి... మళ్ళీ నవంబర్ లో సమంత తాలూకు సీన్స్ షూట్ చేసేలా షెడ్యూల్ వేసుకున్నారంట. సో, ఈ సినిమా పూర్తవ్వడం నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ జరుగుతుంది. కాబట్టి, సంక్రాంతి విడుదలకి అనువైన సమయం కాబట్టి, తమ సినిమా ని అప్పటికి లాక్ చేసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



