మా యానిమల్ మూవీ ఆ డైరెక్టర్ బయోపిక్ అని తేల్చి చెప్పిన చిత్ర హీరో రణబీర్ కపూర్
on Nov 27, 2023
కొన్ని సినిమాల కోసం భాషతో సంబంధం లేకుండా భారతీయ సినిమా ప్రేక్షకులు మొత్తం ఎదురుచూస్తుంటారు. అలా ఎదురుచూసే సినిమాల్లో యానిమల్ మూవీ కూడా ఒకటి. బాలీవుడ్ అగ్రహీరో రణబీర్ హీరోగా వస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకడు అవ్వటంతో యానిమల్ తెలుగులోను విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించి సినిమాకున్న క్రేజ్ ని చెప్పకనే చెప్పింది. తాజాగా ఈ మూవీ కథ కి సంబంధించిన ఒక సీక్రెట్ ని రణబీర్ కపూర్ బయటపెట్టాడు.
నిన్న చెన్నై లో జరిగిన యానిమల్ ప్రమోషన్స్ లో రణబీర్ మాట్లాడుతూ నేను యానిమల్ ముందు వరకు అర్జున్ రెడ్డి మూవీ సందీప్ బయోపిక్ అని అనుకున్నాను కానీ ఈ యానిమల్ మూవీనే సందీప్ నిజమైన బయోపిక్ అని చెప్పాడు. సందీప్ చాలా ఎగ్రెసివ్ పర్సన్ నా క్యారెక్టర్‌కి తన నిజ జీవితంలో జరిగిన విశేషాలను జోడించి ఈ యానిమల్ మూవీని తెరెకెక్కించాడని కూడా రణబీర్ చెప్పుకొచ్చాడు ఇప్పుడు రణబీర్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి.
రణబీర్ కి జోడిగా రష్మిక నటిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం యానిమల్ డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు. రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో భారతీయ చిత్రపరిశ్రమకి చెందిన అతిరధ మహారధులందరు నటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో యానిమల్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబులు పాల్గొనబోతున్నారు .

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
