రానా వర్సెస్ కీర్తి సురేశ్!
on Dec 10, 2021

దగ్గుబాటి స్టార్ రానా, కేరళ కుట్టి కీర్తి సురేశ్ ఇప్పటివరకు కలిసి నటించిన సందర్భం లేదు. అయితే, త్వరలో ఈ ఇద్దరు టాలెంటెడ్ స్టార్స్ తమ తమ చిత్రాలతో ఒకే రోజున బాక్సాఫీస్ ముంగిట పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటించిన స్పోర్ట్స్ డ్రామా `గుడ్ లక్ సఖి` ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది. నగేశ్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షూటర్ పాత్రలో దర్శనమివ్వనుంది కీర్తి. జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా గత కొంతకాలంగా వాయిదాపర్వంలో సాగుతోంది. ఎట్టకేలకు 31న తెరపైకి వస్తోంది. కట్ చేస్తే.. అదే 31న రానా చాన్నాళ్ళ క్రితమే పూర్తి చేసిన `1945` అనే పిరియడ్ డ్రామా రిలీజ్ కి రెడీ అయింది. సత్యశివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రెజీనా నాయికగా నటించగా సత్యరాజ్, నాజర్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
మరి.. రానా వర్సెస్ కీర్తి సురేశ్ అన్నట్లుగా ఉన్న ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే డిసెంబర్ 31 వరకు వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



