విడాకులు సంగీత్ తో సెలెబ్రేట్ చేసుకోవాలి
on Jan 18, 2022
.webp)
సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. విషయం ఏదైనా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా సెలెబ్రిటీల విడాకుల పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
"వివాహాలు ఎంతో ప్రమాదమైనవి అని యువతను హెచ్చరించడానికి స్టార్ విడాకులు మంచి ట్రెండ్ సెట్టర్ లు" అంటూ ఆర్జీవీ తాజాగా ట్వీట్ చేశారు. "పెళ్లి కంటే వేగంగా ప్రేమను ఏవీ హత్య చేయలేవు. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా ప్రేమ ఉన్నంత వరకు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోవడమే ఆనంద రహస్యం." అని మరో ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.
"తెలివైన వాళ్ళు ప్రేమిస్తారు.. తెలివి తక్కువ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు." "వివాహంలో ప్రేమ చాలా తక్కువ రోజులు ఉంటుంది". "వివాహం అనేది అత్యంత దుర్మార్గపు ఆచారం." "విముక్తి దొరుకుతుంది కాబట్టి అసలు విడాకులు సంగీత్ తో సెలెబ్రేట్ చేసుకోవాలి". అంటూ వరుస ట్వీట్స్ తో రెచ్చిపోయారు ఆర్జీవీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



