ధురంధర్ పై వర్మ కీలక వ్యాఖ్యలు.. చిన్న సూట్ కేసుతో ముంబై వెళ్ళింది ఎవరు!
on Dec 19, 2025

ఎందుకు చేసాడు
ఏం మాట్లాడాడు
ఆదిత్య దర్ ఏమన్నాడు
'ధురంధర్'(Dhurandhar)విజయపరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రేక్షకుల మౌత్ టాక్ కి తోడు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ధురంధర్ ని చూసి బాగుందని చెప్తుండటంతో ఇండియా వైడ్ గా ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ఇండియన్ క్రికెట్ టీం సైతం బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా ధురంధర్ ని వీక్షించడంతో సక్సెస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ధురంధర్ పై స్పందించడం జరిగింది.
ఎక్స్ వేదికగా వర్మ స్పందిస్తు 'ధురంధర్ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదు. చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఏ భాషలో తెరకెక్కిందనేది ముఖ్యం కాదు. ధురంధర్ భారతీయ సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం మన మనసులకి హత్తుకుంటుంది. వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం చిత్ర బృందం సాధించిన అతి పెద్ద విజయం. ప్రతి సీన్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. హాలీవుడ్ చిత్రాల్లా కాకుండా మన నేటి వీటికి తగిన విధంగా అంతర్జాతీయ స్థాయిలో కథలు తెరకెక్కించవచ్చని కూడా ఆదిత్య దర్ నిరూపించాడని వర్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.
Also read: అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రివ్యూ
వర్మ ట్వీట్ కి ఆదిత్య దర్(Aditya Dhar)స్పందిస్తు 'వర్మ సార్ నా మూవీ గురించి పోస్ట్ చేయడం నమ్మలేకపోతున్నాను. ఒక అభిమానిగా ఎంతో ఉప్పొంగిపోతున్నాను. దీంతో నా బాధ్యత మరింత పెరిగిందని అనుకుంటున్నాను. ఇక పై ఏ మూవీని తెరకెక్కించిన ఆ పోస్ట్ చూసే తెరకెక్కిస్తాను. ఎన్నో ఏళ్ళ క్రితం ఒక చిన్న సూట్ కేసుతో ముంబై వచ్చాను. వర్మ సార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తే చాలని అనుకున్నానని బదులిచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



