మెగా రేస్ లో...మెగా ఫ్యాన్స్ ఎటు వైపు?
on Oct 16, 2015
ప్రతి సంవత్సరం దసరా సీజన్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి ఎక్కువగానే వుంటుంది. ఎందుకంటే ఈ టైమ్ లో స్కూల్ కి, కాలేజ్ లకి ఎక్కువగా సెలవులు వస్తాయి కాబట్టి ఫ్యామిలీమెంబర్స్ తమ పిల్లలతో సినిమాకు చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను దసరా బరిలో దించేందుకు ఉవ్విళ్ళూరుతారు. అయితే ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే ఫ్యామిలీకి చెందిన మెగా హీరోలు పోటీపడడం ఆసక్తికరంగా మారింది. దీంతో దసరా రేస్ కాస్త మెగా రేస్ గా మారింది. ఈ పోటీలో ముందుగా బరిలోకి దిగింది 'రుద్రమదేవి'.
'రుద్రమదేవిలో' హీరో అనుష్క అయిన ఆ సినిమాకి క్రేజ్ గా మారింది అల్లు అర్జున్ చేసిన గోనాగన్నా రెడ్డి పాత్రే. మొత్తంగా క్రేజ్ తెచ్చుకోవడమే కాదు.. ఏకంగా బి. సి. సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం కూడా చూపించేస్తున్నాడు ఈ గన్నారెడ్డి. 'బ్రూస్ లీ' హావాలో కూడా గోనాగన్నా రెడ్డే రుద్రమదేవికి అండగా నిలవబోతున్నాడు. అందుకే ఇది మెగా సినిమాగా మారింది.
ఇక రేస్ లో లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ'. ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి మెగా అండ వుండడం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బలంగా మారింది. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఈ సినిమా ద్వార చేయడం 'బ్రూస్ లీ' కి వున్న అతి పెద్ద ప్లస్ పాయింట్. బ్రూస్లీ చూసినోళ్లంతా.. సినిమా ఏమీ లేకపోయినా చిరు ఎంట్రీ అదిరిపోయిందంటున్నారు. ఆ మూడు నిమిషాలూ పండగలా ఉంది అని కితాబిస్తున్నారు. ఇప్పుడు బ్రూస్లీని కాపాడవలసింది చిరంజీవే అని క్రిటిక్స్ అంటున్నారు.
ఈ మెగా రేస్ లోకి సడన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు...మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకం అనదగ్గ సినిమా కంచె. ఒక్క ట్రైలర్ తో టాలీవుడ్ నే కాదు.. దేశం మొత్తాన్ని ఆకర్షించిన మూవీ కంచె. సినిమా స్టోరీ పరంగానే కాదు.. అద్భుతమైన విజువల్స్ తో కట్టిపడేశాడు డైరెక్టర్. బాహుబలి యుద్ధ విన్యాసాలు చూశాక మళ్లీ అసాధారణమైన యుద్ధం అంటే ఎలా ఉండబోతోందో కంచె సినిమాలో చూడబోతున్నాం. ఇందులో రెండో ప్రపంచయుద్ధానికి మన దేశంతో ఉన్న లింక్ని చూపిస్తున్నారు. బాహుబలి తర్వాత మళ్లీ విజువల్ ఫీస్ట్ కంచె రూపంలో చూడబోతున్నా౦. ఈ రకంగా చూస్తే మెగా సినిమాల్లో ‘కంచె’కే ఎక్కువ క్రేజ్ ఉందన్నది వాస్తవం.
మొత్తానికి అల్లు అర్జున్ రుద్రమదేవి తో, చిరంజీవి 'బ్రూస్ లీ' తో, కంచె తో 'వరుణ్ తేజ్' మెగా రేస్ ని రసవత్తరంగా మార్చారు. మరి ఈ మెగా రేస్ లో మెగా అభిమానులు ఎవరిని ఎక్కువగా సపోర్ట్ చేసి..మెగా విజేతగా నిలబెడతారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే!!