అసలు ఆట ముందుంది.. ప్రీ విజువలైజేషన్ తో అంచనాలు పెరిగాయి
on Sep 20, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan),పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ (Sukumar)రంగస్థలంతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చరణ్ కెరీర్ లో మగధీర తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, నటుడుగా చరణ్ ని ఇంకో మెట్టు పైన నిలబెట్టింది. 'చిరంజీవి'(Chiranjeevi)సైతం రంగస్థలం విజయంపై మాట్లాడుతు నా కెరీర్ లో 'ఖైధీ' ఎలాగో, చరణ్ కి 'రంగస్థలం' అని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చరణ్ క్యారక్టర్, కథ, కథనాలు ఎంతగా ప్రేక్షకుల్లో ప్రభావం చూపించాయో అర్ధం చేసుకోవచ్చు. సుకుమార్ కి కూడా అప్పటి వరకు చేసిన చిత్రాలు ఒక ఎత్తయితే, రంగస్థలం ఒక ఎత్తు. ఈ చిత్రం అందించిన విజయంతోనే సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో 'పుష్ప' సిరీస్ ని డీల్ చేసాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ నేపథ్యంలో సుకుమార్, చరణ్ కాంబోలో మళ్ళీ సినిమా రూపుదిద్దుకుంటుంటే, అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైంది. మరో వైపు ' ప్రీ విజువలైజేషన్' పనులు కూడా చకచకా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు ప్రకటించాయి. ప్రీ విజువలైజేషన్ అంటే కథకి సంబంధించిన అన్ని అంశాలని సాంకేతికంగా,విజువల్ గా ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం సెట్ చేసుకుంటారు. రోజు రోజుకి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త కథ, కథనాలు ఆవిష్కృతమవుతున్నాయి. విజువల్ గా, సాంకేతికత పరంగా కూడా మెస్మరైజ్ చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కే 'కథ'పై ఆసక్తి నెలకొని ఉంది. పైగా పుష్ప సిరీస్ తో సుకుమార్ నెక్స్ట్ చిత్రం కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో కథ ,కథనాల విషయంలో సుకుమార్ రాజీ పడడు. తన ఇమేజ్ ని కూడా కాపాడుకోవాలి. ఈ నేపథ్యంలో చరణ్ సినిమాని పుష్ప సిరీస్ ని మించిన విజయం చెయ్యాలనే దిశగా తన అడుగులు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ముందు ముందు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్'(Mythri Movie Makers)తో కలిసి సుకుమార్ నే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
చరణ్ ప్రస్తుతం 'పెద్ది'(Peddi)తో బిజీగా ఉన్నాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నెక్స్ట్ ఇయర్ మార్చి 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడు కాగా,వృద్ధి సినిమాస్(Vrudhi Cinimas)నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



