పెళ్లి వార్తలపై హానెస్ట్ గా స్పందించిన హీరో రామ్
on Jun 29, 2022

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తన స్కూల్ మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఇంగ్లీష్ వెబ్ సైట్స్ సైతం రామ్ తన సీక్రెట్ హైస్కూల్ స్వీట్ హార్ట్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని రాసుకొచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా రామ్ స్పందించాడు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దంటూ ట్వీట్ చేశాడు.
"ఓరి దేవుడా!.. ఆపండి.. నేను ఏ సీక్రెట్ హైస్కూల్ స్వీట్ హార్ట్ ని పెళ్లి చేసుకోవడం లేదని ఆఖరికి నా కుటుంబసభ్యులు, స్నేహితులను నమ్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే అసలు నేను హైస్కూల్ కి వెళ్లిందే చాలా అరుదు" అంటూ తనదైన శైలిలో స్పందించాడు రామ్.

రామ్ ట్వీట్ తో త్వరలోనే తను స్కూల్ మేట్ ని పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరి టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకడైన 34 ఏళ్ళ రామ్ ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



