వర్మకి సడన్‌గా ఇంత ప్రేమ ఎందుకొచ్చింది
on Jun 3, 2017

రామ్ గోపాల్ వర్మ బడా హీరోల, దర్శకుల, లేదా తనకు అత్యంత సన్నిహితుల, లేదా పడని వాళ్ళ సినిమాలపై తన అభిప్రాయం చెప్పడం చూసాం. కానీ, మొదటిసారి, ఒక చిన్న సినిమా పై తన ప్రేమ ఒలకబోశారు. రాజ్ తరుణ్, హెబా పటేల్ జంటగా నటించిన అందగాడు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది, కానీ వర్మ కి మాత్రం ఆ సినిమా భలే నచ్చేసిందట. ఇంత వరకు పక్కింటి అబ్బాయి పాత్రలు చేసిన రాజ్ తరుణ్, తన కామెడీ టైమింగ్ తో యువతని అలరించాడు. అందగాడుతో తాను ఆక్షన్, ఇతర వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. అందగాడులో ఊహించని మలుపులు చాలా ఉన్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా మొదలై... ఆసక్తికరమైన సినిమాగా ఎండ్ అయింది. సాధారణంగా, హాలీవుడ్లో జోనర్ చేంజ్ అవుతూ ఉండడం చూస్తుంటాం.
అందగాడు కూడా అదే కోవకి చెందుతుంది. రాజ్ తరుణ్ చూపించిన వర్సెటాలిటీ ఈ మధ్య కాలంలో చూడలేదు. నాకు అందగాడు చాలా బాగా నచ్చింది. సినిమా యూనిట్ సభ్యులందరికీ అల్ ది బెస్ట్, అని అందగాడు పై తన సడన్ ప్రేమ కురిపించాడు వర్మ. చిరంజీవి దగ్గరి నుండి పవన్ కళ్యాణ్, ఇతర హీరోలందరినీ సమయం సందర్భం బట్టి ఏకి పారేసిన రాము గారు అందగాడు పై, రాజ్ తరుణ్ పై ఇంత కరుణ ఎందుకు చుపించాడో ఆ దేవుడికే తెలియాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



