సూపర్ స్టార్లపై విరుచుకుపడిన వర్మ
on Dec 4, 2015
.jpg)
ఏ అంశాన్నయినా వివాస్పదంగా చెప్పాలంటే వర్మని మించినోడు లేడని చెప్పాలి. జనాలు మొత్తం ఒకరకంగా ఆలోచిస్తే..తాను ఇంకోరకంగా ఆలోచించి ఆ విషయాన్ని జనాలను ఆలోపించచేసేలా ట్వీట్ చేయడం రామ్ గోపాల్ వర్మ స్టయిల్. లేటెస్ట్ గా వర్మ చెన్నై భాదితులకు స్టార్లు ప్రకటిస్తున్న సాయంపై విరుచుకుపడ్డాడు. వందల కోట్లు ఉన్న సూపర్ స్టార్లు.. వేలాది కోట్ల రూపాయిలు నష్టపోయిన చెన్నైవాసులకు రూ.5.. రూ.10 లక్షలు సాయాన్ని ప్రకటించటాన్ని బిచ్చంతో పోల్చారు. సూపర్ స్టార్లు రూ.10లక్షలు.. రూ.5 లక్షలు డబ్బు ఇస్తే.. అంత డబ్బును ఏంచేయాలో అర్థం కాక చెన్నై ప్రజలు స్పృహ కోల్పోతారన్న వర్మ.. దాని కంటే ఇవ్వకుండా ఉండటం మంచిదన్నారు. వర్షాలు కురిసేది దేవుడి వల్లనే కాబట్టి.. దేవుడ్ని ప్రార్థించటానికి బదులు విమర్శించాలన్నారు. అలాగే తాను అత్యంత స్వార్థపరుడినని.. తన జీవితంలో ఎవరికి దానం చేయలేదని.. అందుకే తాను దానం ఇవ్వటం లేదని కవరింగ్ కూడా ఇచ్చుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



