నిహారిక హ్యాపీ - ప్రీ వెడ్డింగ్‌కి రామ్ చరణ్.
on Jul 20, 2018

మెగా డాటర్ నిహారిక, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు.ఈ నెల 21న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయనున్నారు.మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ‘హ్యాపి వెడ్డింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.‘‘పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా చూపించాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది.ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 21న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. ఈ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్ర నిర్మాత తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



