సింగపూర్ లో రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమీ విగ్రహం
on Sep 30, 2024

రెండు దశాబ్దాల నుంచి తన యాక్టింగ్ తో మెగా అభిమానులనే కాకుండా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్(rrr) తో గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగిన చరణ్ కి తాజాగా ఒక అరుదైన గౌరవం దక్కబోతోంది.దీంతో గేమ్ చేంజర్(game changer)రిలీజ్ కంటే ముందే మెగా అభిమానుల్లో సందడి వాతావరణం వచ్చినట్లయ్యింది.
సింగపూర్ లోని ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని రీసెంట్ గా అబుదాబి లో జరిగిన ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తెలిపారు.చరణ్ తో పాటు చరణ్ పెంపుడు డాగ్ రైమీ(rhyme)మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం.అందుకు సంబంధించిన ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక చరణ్ కూడా ఈ విషయంపై మాట్లాడుతు మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో చేరడం చాలా గౌరవంగా భావిస్తున్నానని, తన మైనపు బొమ్మ ద్వారా అభిమానులకు మరింత చేరువ అయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
సినిమాల విషయానికి వస్తే చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.అందులో భాగంగానే గేమ్ చేంజర్ నుంచి రా మచ్చా అనే రెండో సాంగ్ రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే గేమ్ చేంజర్ షూటింగ్ కి ముగింపు పలికిన చరణ్ ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



