మనవరాలి పేరుని ప్రకటించిన మెగాస్టార్!
on Jun 30, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టి నేటికి 11వ రోజు కావడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం ఈరోజు బారసాల వేడుక నిర్వహించి పాపకు పేరు పెట్టారు.
తన మనవరాలి పేరును తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. పాపకు క్లీంకార కొణిదెల గా నామకరణం చేసినట్లు చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పేరుని లలితా సహస్రనామం నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కుమార్తెకు క్లీంకార కొణిదెల అనే పేరుని పెట్టినట్లు ఉపాసన కూడా సోషల్ మీదకి వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. చిరంజీవి దంపుతులతో పాటు, తన తల్లిదండ్రులు పాపతో ఉన్న ఫోటోని ఉపాసన షేర్ చేశారు.
కాగా "ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి" అనే శ్లోకం నుంచి ఈ పేరు తీసుకున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



