క్లీంకార ఆగమనం.. హృదయానికి హత్తుకునే వీడియో విడుదల చేసిన మెగా దంపతులు!
on Jul 20, 2023

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20 న తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఆ పాపకు 'క్లీంకార' అనే పేరుని పెట్టారు. మెగా ప్రిన్సెస్ పుట్టి నేటికి నెల రోజులవుతుంది. దీంతో క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ సందర్భంగా హృదయానికి హత్తుకునే అందమైన వీడియోను విడుదల చేశారు. ఈరోజునే ఉపాసన పుట్టినరోజు కూడా కావటం విశేషం.
క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నారు. క్లీంకార రాకతో వారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా పాపని మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు తండ్రిగా రామ్ చరణ్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము.
ఈ భావోద్వేగం గురించి స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ "క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టటానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం" అన్నారు.
ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల మాట్లాడుతూ "మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తాను" అన్నారు.
మెగా దంపతులు విడుదల చేసిన ఈ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



