రామ్ చరణ్ నర్తన్ చిత్రాన్ని నిర్మించేది వారేనట!
on Dec 29, 2022

తెలుగులో యూవి క్రియేషన్స్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రభాస్ సన్నిహితులతో నిర్మితమైన ఈ సంస్థ భారీ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలను కూడా నిర్మిస్తూ వస్తోంది. వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ కుమార్ ఉప్పలపాటి, విక్రం రెడ్డిలు సంయుక్తంగా ఈ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థలో భారీ చిత్రాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు,శర్వానంద్, నాని వంటి యంగ్ స్టార్స్ తో ఈ సంస్థ చిత్రాలు నిర్మిస్తోంది. ప్రభాస్ తో మిర్చి, సాహూ, రాధేశ్యామ్ వంటి చిత్రాలను నియమించిన ఈ సంస్థ అనుష్క ప్రధాన పాత్రలో భాగమతి, నానితో భలే భలే మగాడివోయ్, శర్వానంద్ తో ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు, రన్ రాజా రన్, హ్యాపీ వెడ్డింగ్, గోపీచంద్ తో జిల్, పక్కా కమర్షియల్ సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ, విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా వంటి చిత్రాలను రూపొందించింది. ఇక ఈ సంస్థ అధినేతలకు హీరో రామ్ చరణ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో ఎప్పటినుంచో మెగా పవర్ స్టార్ రాంచరణ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తో ఓ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే తన తాజా ప్రాజెక్టును రామ్ చరణ్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా యువి క్రియేషన్స్ కొన్నాళ్లుగా డిస్కషన్స్ జరుపుతోంది. ఫైనల్ గా ఈ ప్రాజెక్టు ఓకే అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని కన్నడ యువ దర్శకుడు నర్తన్ డైరెక్ట్ చేస్తారని సమాచారం. కన్నడలో శివరాజ్ కుమార్ తో మఫ్తీ అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ తో మెప్పించారు. ఇప్పుడు చరణ్ కోసం ఆయన ఓ అద్భుతమైన లైన్తో వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కన్నడ దర్శకులు పాన్ ఇండియా రేస్ లో దూసుకుని పోతున్నారు. రియాల్టీ కి దగ్గరగా ఉంటూనే కమర్షియల్ హిట్ చిత్రాలను తీస్తున్నారు. ఆల్రెడీ కేజిఎఫ్ చాప్టర్ 1,2 లతో పాటు కాంతారా సినిమా కన్నడ సినీ పరిశ్రమ సత్తాను చాటింది. ఇక ఇప్పుడు మరో దర్శకుడు అక్కడి నుండి వచ్చి చరణ్తో సినిమాకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు ప్రభాస్ కన్నడ దర్శకుడు అయినా కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో సలార్ మూవీ తీస్తోన్న సంగతి తెలిసిందే. కాగా రామ్‌చరణ్ మూవీ కథ ఏంటి? ఏ జోనర్‌లో ఉండబోతోంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి యూవీ క్రియేషన్స్ వారు మాత్రం రామ్ చరణ్ నర్తన్‌ల కాంబినేషన్‌ను లాక్ చేశారు. రంగస్థలం నుంచి చరణ్ ప్రతి సినిమాతో ప్రేక్షకుల అంచనాలను మించి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ తో మెప్పించాలని కసిగా ఉన్నారు. ఆచార్య నిరాశపర్చినప్పటికీ శంకర్ తో చేస్తోన్న ఆర్సి15 మరో రేంజ్ లో ఉండబోతోంది అని తెలుస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్ ల తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రభావం చూపించబోతున్నారని ఫిక్స్ కావచ్చు. ఇలా శంకర్ తీస్తోన్న ఆర్సీ15,ఆ తర్వాత బుచ్చిబాబు సనాతో చేయబోయే ఆర్సీ 16, ఆ వెంటనే నర్తన్ డైరెక్షన్లో ఆర్సీ 17 చిత్రాలు చేస్తోన్నరామ్ చరణ్ తదుపరి మూడు చిత్రాలను పాన్ ఇండియా రేంజ్లో చేసి ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్, ఇమేజ్లను మరింతగా పెంచుకుంటాడనే భావించాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



