రామ్‌చరణ్ కూడా మొదలుపెట్టాడు
on Nov 12, 2019
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్... హీరో హీరోయిన్లు తాము ఏ సినిమా షూటింగుకు వెళుతున్నాం? తాము ఎక్కడ ఏం చేస్తున్నాం? ఏం తింటున్నాం? వంటి అప్‌డేట్స్ ఇవ్వడానికి విపరీతంగా వాడేస్తున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్లు. ఫ్లైట్‌లో కిటికీ పక్కన సీట్ వస్తే ఇన్‌స్టాలో స్టోరీ పెట్టే హీరోయిన్లు ఉన్నారు. సినిమా సెలబ్రిటీల వాడకం ఆ రేంజ్‌లో ఉంటుంది.
'సైరా నరసింహారెడ్డి' విడుదల ముందువరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రామ్ చరణ్, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇప్పటివరకు 'సైరా' ప్రమోషన్స్, బర్త్ డే విషెస్ చెప్పడం కోసం ఇన్‌స్టాను వాడాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అందరిలా వాడటం మొదలుపెట్టాడు. ఈ రోజు మార్నింగ్ ఇన్‌స్టాలో మెగాపవర్ స్టార్ ఒక స్టోరీ పెట్టాడు. అందులో మేటర్ ఏంటంటే... ఎర్లీ మార్నింగ్ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి రామ్ చరణ్ వెళ్లాడు. అదీ సంగతి. "రామోజీ ఫిల్మ్ సిటీకి, స్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ షూటింగ్ కి రావడం చాలా బావుంటుంది. నేను మార్నింగ్ షూట్స్ ఎంత మిస్ అవుతున్నాననేది ఈ రోజు వరకు గుర్తించలేదు" అని రామ్ చరణ్ అన్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
