విశాల్ పొలికికల్ ఎంట్రీ.... వివాదానికి తెర తీసిన చెర్రీ
on Dec 12, 2017
.jpg)
జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది. చిన్నమ్మ, పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య కుర్చీ కొట్లాటలో ఒకరు గెలుస్తూ, మిగతా వారు ఓడుతూ జనాల్లో అసహనం పెంచుతూ వచ్చారు. ఇదే సరయిన సమయంగా భావించిన కేంద్రం పెద్దలు తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే, రజినీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమవుతున్నట్లు తమ వేగుల ద్వారా సంకేతాలు పంపించారు. స్టార్ హీరో విజయ్ కూడా సొంత పార్టీ పెట్టడమో, లేక ఉన్న పెద్ద పార్టీల్లో ఒక దాంట్లో చేరడంతో జరగొచ్చని వార్తలు వచ్చాయి.
ఈ ఊహాగానాలు ఇలా కొనసాగుతున్న సమయంలో, అందరికి షాక్ ఇస్తూ... విశాల్ ఏకంగా అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ బై ఎలక్షన్స్ లో నామినేషన్ దాఖలు చేసాడు. విశాల్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటే, గతంలో కొన్ని సార్లు వివాదాలకు తావిచ్చిన మన రామ్ చరణ్ మాత్రం తనదయిన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. విశాల్ పొలిటికల్ ఎంట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి అని అడిగిన విలేకరులకు సమాధానమిస్తూ, "పక్క రాష్ట్రాల వారి గురించి మనకెందుకండి? మన రాష్ట్రాల వారి గురించే మాత్రమే మాట్లాడండి," అని అన్నారు.
రామ్ చరణ్ కి తెలిసి అలా అన్నాడా లేదా తెలియక అన్నాడో కానీ విశాల్ తెలుగు సంతతికి చెందిన వాడు అన్న విషయం మరచిపోకూడదు. అలా కాకుండా నో కామెంట్స్ అని చెప్పేసి వెళ్ళిపోయినా బాగుండేది. కానీ, పక్క రాష్ట్రాలవారు అనడం ఒక రకంగా వివాదానికి తెర తీసాడని చెప్పొచ్చు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



