ఇటురాయె అంటున్న మహేశ్!
on Jun 18, 2015
.jpg)
మహేశ్ సమంతని సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడా? గోల్డెన్ లెగ్ బ్యూటీ ఉంటే సినిమా హిట్టని భావిస్తున్నాడా? ఫిల్మ్ నగర్లో ఇదే డిస్కషన్. ఎందుకంటే తన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవంలో సమంతతో రొమాన్స్ చేసేందుకు ఫిక్సయ్యాడట. ముందుగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అనుకున్నారు.....కానీ ఏమైందో ఏమో ఇంతలో రకుల్ అవుట్ అయి సమ్మూ ఎంట్రీ ఇచ్చింది. ఎవరైనా సీనియర్ బ్యూటీని పక్కనపెట్టి ఫాలోయింగ్ ఉన్న కొత్తమ్మాయిని తీసుకుంటారు. కానీ సమంతకి ఎందుకు ప్రయార్టీ ఇచ్చినట్టో అని చెవులుకొరుక్కుంటున్నారు.
దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు తర్వాత పాపం ప్రిన్స్ కి కాలం కలసి రాలేదు. దీంతో అమ్మడు తప్పనిసరిగా హిట్టిస్తుందనే ఆలోచనలో ఉన్నాడట. అయితే అంతసీన్ లేదు కానీ....రకుల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండండతో....సమంతని తీసుకోవాల్సి వచ్చిందంటున్న వాళ్లూ లేకపోలేదు. ఆ సంగతంతా పక్కనపెడితే....ముచ్చటగా మూడోసారి మహేశ్-సమంత జంట హిట్టందుకుంటుందా? చూద్దాం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



