మన్మథుడిని మరిచిపోయే ప్రయత్నాలా?
on Aug 12, 2019

రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన తాజా తెలుగు చిత్రం 'మన్మథుడు 2' విడుదలై ఇంకా వారం రోజులు కూడా కాలేదు. సోషల్ మీడియాలో, రివ్యూల్లో ఈ సినిమాపై విమర్శల జడివాన విడుదలైన రోజు నుండి కురుస్తూనే ఉంది. ప్రేక్షకుల్లో డివైడ్ టాక్ వచ్చింది. నాగార్జున మాత్రం డివైడ్ టాక్ లేదని, వసూళ్లు బాగున్నాయి అని చెబుతున్నారు. ఆయన మాటలు పక్కన పెడితే... రకుల్ చిత్రాన్ని మర్చిపోయా ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఉన్నారు. తమిళ సినిమా చిత్రీకరణలో బిజీ అయ్యారు. కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా 'భారతీయుడు 2'. ఇందులో 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడి పక్కన రకుల్ కథానాయికగా నటిస్తోంది. సోమవారం తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా ప్రారంభించింది. సోషల్ మీడియాలో భారతీయుడు-2 గురించి మాట్లాడుతోంది. అదే సమయంలో 'మన్మథుడు 2' ఒక ముక్క కూడా మాట్లాడటం లేదు. సినిమాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



