ఎన్టీఆర్ అతిలోక సుందరి ఆమేనా?
on Jul 25, 2018
నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్.ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు.ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.‘ఎన్టీఆర్’లో శ్రీదేవిగా దీపికా పదుకొణె నటించే అవకాశాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాత్ర కోసం రకుల్‌ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది.
ఈ మేరకు దర్శక, నిర్మాతలు రకుల్‌ను కలిశారని ప్రచారం జరుగుతోంది. శ్రీదేవిగా నటించేందుకు రకుల్ కూడా సుముఖత చూపారని సమాచారం.ఎన్టీఆర్‌తో కలిసి వేటగాడు చిత్రంలోని ఆకుచాటు పిందే తడిసే పాటకు స్టెప్పులు వేయనున్నారట.ఇప్పటికే ఈ సినిమాలోని వివిధ పాత్రలపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణ పాత్ర కోసం మహేశ్‌బాబును, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం నాగచైతన్యను సంప్రదించినట్లు తెలుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నారని, రాజశేఖర్, మోహన్‌బాబు కూడా ఈ చిత్రంలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.తమిళంలో సూర్య నటించే ఎన్జీకే, హిందీలో అజయ్ దేవగన్‌తో, కార్తీతో మరో చిత్రంలో నటిస్తున్నది.