ముంబై నేపథ్యంలో సూపర్ స్టార్ చిత్రం!!
on Mar 13, 2019

సూపర్ స్టార్ రజనీ కాంత్ వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నాడు. తాజాగా కేవలం ఎనిమిది నెలల గ్యాప్ లోనే `కాలా` , `2.0` , `పేట` చిత్రాలతో పలకరించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ఇదే ఊపులో తన తర్వాత చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నాడు సూపర్ స్టార్ . బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రజనీ డబుల్ రోల్ లో సందడి చేయబోతున్నాడు. అందులో ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కాగా మరొకటి సోషల్ వర్కర్ రోల్ అని టాక్. అలాగే రజనీకి జోడీగా నయనతార, కీర్తి సురేస్ నటించబోతున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్ సమాచారం ప్రకారం రజనీ , మురగదాస్ కాంబినేషనల్ మూవీ ముంబై నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. గతంలో ఇదే నేపథ్యంలో రజనీ నటించిన `బాషా` తాజా చిత్రం `పేట` అభిమానులను విశేషంగా అలరించిన నేపథ్యంలో కొత్త చిత్రం కూడా మురిపిస్తుందేమో చూడాలి. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ ఏడాది చివరలో తెరపైకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



