అర్ధరాత్రి హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ అయిన రజనీకాంత్!
on Sep 30, 2024

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth)సోమవారం అర్థరాత్రి చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేరడంతో ఆయన అభిమానులతో పాటు ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో ఆందోళన మొదలయ్యింది. దీంతో రజనీ హెల్త్ న్యూస్ ఇప్పుడు ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారడంతో పాటు రజనీకి ఏమైందని ఆరా తీస్తున్నారు.
డెబ్భై మూడు సంవత్సరాల రజనీకాంత్, గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ మేరకు మంగళవారం నాడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన సాయి సతీష్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని డాక్టర్స్ చెప్పారని కూడా అంటున్నారు. అయితే, రజనీ ఆస్పత్రిలో చేరడంపై అటు కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
రజనీ ఇటీవలే వెట్టయాన్(Vettaiyan)మూవీని కంప్లైంట్ చేసాడు.ఈ నెల వరల్డ్ పది న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండగా సూర్య తో జై భీం తెరకెక్కించి నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన టి జె జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో వెట్టయాన్ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.రీసెంట్ గా ఆడియో లంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది.ఇక లోకేష్ కనగరాజ్ తో కూడా కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



