వీరప్పన్ కోసమే జయలలితతో గొడవ పెట్టుకున్నా..రజనీకాంత్ సంచలన స్పీచ్
on Apr 10, 2025
తమిళ చిత్రసీమలో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)కి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.1996 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడు రాష్ట్రాన్ని,ప్రజలను ఆ దేవుడు కూడా రక్షించలేడంటు వ్యాఖ్యలు చేస్తే జయలలిత(Jayalalitha)సీఎం పదవి కోల్పోయింది.రజనీ కి ఉన్న ఫాలోయింగ్ కి ఇదే ఉదాహరణ. అయితే జయలలిత గురించి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో రజనీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
రజనీ మాట్లాడుతు' అన్నాడీఎంకే నేత, సినీ నిర్మాత ఆర్.ఎం. వీరప్పన్ (Veerappan)కి,నాకు మధ్య మంచి స్నేహం బంధం ఉంది.బాషా మూవీకి ఆయనే నిర్మాత.మూవీ పెద్ద సక్సెస్ కావడంతో 1995లో చెన్నైలో శత దినోత్సవ వేడుకలు నిర్వహించాం.ఆ సమయంలో జయలలిత ప్రభుత్వంలో వీరప్పన్ మంత్రిగా ఉండటం వలన నిర్మాత హోదాలో'బాషా’ఈవెంట్లో పాల్గొన్నారు.ఆ కార్యక్రమంలో తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని, రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని నేను చెప్పాను.రజినీకాంత్ వ్యాఖ్యలు మీరెందుకు ఖండించలేదని వీరప్పన్ ని కోప్పడిన జయలలిత మంత్రి పదవి నుంచి తప్పించింది.ఈ విషయంలో చాలా బాధపడ్డాను.వీరప్పన్కి ఫోన్ చేసి జయలలితతో నేను మాట్లాడతానని అంటే నాకోసం మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు.నాకు పదవులు ముఖ్యం కాదని వీరప్పన్ చెప్పాడు.నా మిత్రుడికి జరిగిన అన్యాయం వల్లనే రాజకీయ పరమైన విషయాల్లో జయలలితని వ్యతిరేకించాను.
అయితే తాను ఎంత తొందరపాటుగా వ్యవహరించానో అర్ధం చేసుకొని జయలలిత మరణించిన తర్వాత తమిళ చలనచిత్ర నటీనటుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంతాప సభలో 1996లో జయలలితపై వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశాను.నావల్లే ఓడిపోయారని తెలిసినా జయలలిత పెద్ద మనసు చేసుకుని నా కుమార్తె వివాహానికి వచ్చారు.ఈ ప్రపంచంలో గురువును మించిన శిష్యులు కొందరే ఉంటారు.అలాంటి వారిలో జయలలిత ఒకరని కొనియాడారు.రజనీ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీతో పాటు 'నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 చేస్తున్నాడు.ముందుగా 'కూలీ' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
