30 ఏళ్ళు వెనక్కి వెళ్తున్న రజనీకాంత్.. ఇదే జరిగితే ఒక సంచలనమే
on Jul 2, 2025

సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్(Rajinikanth),అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)విభిన్న చిత్రాల దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj) కాంబోలో 'కూలీ'(Coolie)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అని అందిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయమనే నమ్మకం ఏర్పడింది. గతంలో రజనీ, అనిరుద్ కాంబోలో వచ్చిన 'జైలర్' మూవీలోని 'హుకుం' సాంగ్ సృష్టించిన సంచలనం తెలిసిందే.
రీసెంట్ గా 'కూలీ నుంచి 'చికిటు' అనే మాస్ సాంగ్ రిలీజ్ అయ్యింది. రజనీ ఇమేజ్ కి తగ్గట్టుగా సాగిన సాంగ్ ట్యూన్ ,లిరిక్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తున్నాయి. సాంగ్ కి సంబంధించి రిలీజ్ చేసిన అఫిషియల్ మ్యూజిక్ వీడియోలో రజనీ మరో సారి తన హుక్ స్టెప్స్ ని సూపర్ గా చేసాడు. ఈ విషయంపై అనిరుద్ మాట్లాడుతు 'చికుటు' పాటకి డాన్స్ చెయ్యడానికి రజనీ ఎంతగానో కష్టపడ్డారు. ఒక సవాలుగా తీసుకొని తన వింటేజ్ స్టైల్లో అద్భుతంగా డాన్స్ చేసారు. ఆ విజువల్స్ చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. ముప్పై ఏళ్ళ క్రితం రజనీ ఎలా డాన్స్ చేసారో ఇప్పుడు అలాగే చేసారని అనిరుద్ చెప్పుకొచ్చాడు.
జైలర్ ని నిర్మించిన సన్ పిక్చర్స్ 'కూలీ' ని భారీ వ్యయంతో నిర్మిస్తుండగా 'శృతి హాసన్'(Shruthi Haasan)హీరోయిన్ గా చేస్తుంది. ఉపేంద్ర, సౌభిన్ షాహిర్, సత్యరాజ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ హీరోయిన్ పూజాహెగ్డే(Pooja Hegde)ప్రత్యేక గీతంలో అలరించబోతుంది. అగ్ర హీరో అమీర్ ఖాన్(Amir Khan)కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



