లింగా ట్రైలర్.. ఏముంది ఇందులో?
on Nov 3, 2014
.jpg)
రజనీకాంత్ కొత్త సినిమా లింగా ట్రైటర్ విడుదలై మూడు రోజులైంది. ఇప్పటికే యూ ట్యూబ్‌లో 13 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో లింగా ట్రైటర్ గురించే చర్చంతా. ఫ్యాన్స్ క్లిక్కుల మీద క్లిక్కులు కొడుతున్నారు. లింగా ట్రైలర్ చూశారా అంటూ షేర్లు చేసుకొంటున్నారు. అన్ని లింకులూ గలగలిపి దాదాపు 25 లక్షల హిట్స్ ఈ టీజర్ కివచ్చాయి. ఐనా ఏముంది ఇందులో...?? నిండా ఒక్క నిమిషం కూడా లేని ఈ టీజర్లో విషయం ఏముందని ఇన్ని లైకులు, ఇన్ని హిట్సూ, ఇన్ని కామెంట్లూ...?? ఒక్క డైలాగ్ లేదు.
రజనీ స్టైల్ కూసింత కూడా కనిపించలేదు.
అటు అనుష్క, ఇటు సోనాక్షి ఇద్దరున్నా ఒక్కరి కటౌట్ కూడా కంటికి ఆనలేదు.
రెహమాన్ బాషా బాషా టైపులో లింగా లింగా అంటూ కోరస్ పాడించాడు తప్ప మెరుపుల్లేవు
కొడితే దుమ్ము రేగిపోవడాలూ, గోడలు బద్దలైపోవడాలూ లేవు. ఏముంది ఇందులో..?
రజనీ మాయ తప్ప ఇంకేం లేవు. రజనీ బొమ్మ ఉందా, లేదా అనేదే ఫ్యాన్స్‌కి కావాలి. రెండు సెకన్ల పాటు నడిచొస్తే చాలనుకొంటారు. రజనీ నీడ కనిపించినా ఉబ్బితబ్బుబ్బి అయిపోతారు. లింగా టీజర్లో ఇవే ఉన్నాయ్. సో... ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి? ఒక్క డైలాగూ పేల్చకుండానే టీజర్ కిక్కిస్తుంటే, సినిమా ని ఇంకెంత పిచ్చపిచ్చగా చూసేస్తారో.? ఏది ఏమైనా రజనీ మానియాకు మరోసారి అద్దం పట్టింది లింగా టీజర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



