జయసుధ ఓడినా సెటైర్లు వేసింది..!!
on Apr 18, 2015
.jpg)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పరాజయం పాలైన జయసుధ సాయంత్రానికి తీరిగ్గా మా ఎన్నికల ఫలితాలపై స్పదించారు. రాజేంద్రప్రసాద్ గెలిచినందుకు ఆయనకు అభినందనలు తెలుపుతూనే, ఆయనపై పై సెటైర్లు కూడా వేశారు. గెలిచిన తర్వాత రాజేంద్రప్రసాద్, రాజకీయ ప్రసంగాలు చేయడం తనకు నచ్చలేదన్నదన్నారు. నాయకుడిగా ఆయన వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని నీతులు చెప్పారు. కౌంటింగ్ తర్వాత రాజేంద్రప్రసాద్ కాస్త ఎగ్రెసివ్‌గానే మాట్లాడిన విషయం నిజమే కానీ ఓడిపోయిన జయసుధ ఆయనపై సెటైర్లు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి జయసుధ ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారో? ఏమో గానీ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఫిల్మ్ చాంబర్ వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



