రాజమౌళి ఇంట పెళ్ళి సందడి!!
on Dec 6, 2018

ఏస్ డైరక్టర్ రాజమౌళి ప్రజంట్ `ఆర్ ఆర్ ఆర్` మహా మల్టీస్టారర్ చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లి పనులతో బిజీ కాబోతున్నాడని తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే... జగపతి బాబు సోదరుడైన రాంప్రసాద్ డాటర్ పూజా ప్రసాద్ తో ఇటీవల రాజమౌళి తనయుడు కార్తికేయకు ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం డిసెంబర్ 30న గ్రాండ్ గా జరపడానికి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసారు ఇరువురి కుటుంబ సభ్యులు. ఈ వివాహ వేడుకను జైపూర్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు రాజమౌళి. జైపూర్ లోని పారామౌంట్ హోటల్‌లో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు మరికొంత సినీ సెలబ్రిటీస్ ఈ మ్యారేజ్ కు హాజరుకానున్నారని సమాచారం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు తనయుడు కార్తికేయ పెళ్లి పనులతో బిజీ బిజీగా గడుపుతోంది రాజమౌళి ఫ్యామిలీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



