ఒక రోజు ముందుగానే రాజధాని ఫైల్స్..కడపలో కూడా రైతుదే విజయం
on Feb 14, 2024

ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాని ఎవరు ఆపలేరని మరోసారి నిరూపించిన చిత్రం రాజధాని ఫైల్స్. ఫిబ్రవరి 15 న విడుదల అవుతున్న ఈ మూవీని విడుదల కాకుండా ఆపాలని కొంత మంది ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఒక రోజు ముందుగానే రాజధాని ఫైల్స్ థియేటర్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
రాజధాని ఫైల్స్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షో లతో థియేటర్స్ లో ఒక నవ శకానికి నాంది పలకబోతుంది. కర్నూల్ ఎస్ విసి థియేటర్ స్క్రీన్ 2 లో 7 :30 pm కి కడప తహార్ లో 6 :30 pm కి అనంతపురం గౌతమీ 6 :30 pm తిరుపతి జయశ్యాం 6 :30 గుంటూరు బాలీవుడ్ 9 :30 , ఒంగోలు గోపి 9 :30 , విజయవాడ క్యాప్టిల్ సినిమా 8 pm ఇలా అన్ని చోట్ల ప్రీమియర్ షోస్ తో రాజధాని ఫైల్స్ తన సత్తా చాటనుంది.

రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆత్రనాధాన్ని ప్రపంచానికి తెలియచెయ్యాలనే ఉద్దేశంతో రాజధాని ఫైల్స్ తెరకెక్కింది.నేటికీ ఆ ప్రాంతంలో రైతులు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? వాళ్ళకి జరిగిన అన్యాయం తాలూకు ఖరీదు ఎంత? వాళ్ళు ఎన్నాళ్ళుగా పోరాటాలు చేస్తున్నారు? ఆ పోరాటాల్లో వాళ్లకి జరిగిన అన్యాయాలు ఏంటి అవమానాలు ఏంటి? ఇలాంటి వాటన్నింటికి రాజధాని ఫైల్స్ సమాధానం చెప్పనుంది.సీనియర్ నటి నటులైన వినోద్ కుమార్,వాణి విశ్వనాధ్ ప్రధాన పాత్రలని పోషించిన ఈ చిత్రంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అందరు నటించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



