పెళ్లి పీటలెక్కుతోన్న రాజ్ తరుణ్!!
on May 29, 2019
`ఉయ్యాల జంపాల`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అవును ఈ విషయాన్ని రాజ్ తరణ్ స్వయంగా తెలిపాడు. అయితే వధువు ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గత కొంత కాలంగా వైజాగ్ కి చెందిన ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నాడని సన్నిహితులు ద్వారా తెలుస్తోంది. అయితే రాజ్ తరుణ్ చేసుకునేది లవ్ మ్యారేజా, లేక అరేంజ్డ్ మ్యారేజా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలో ఏడడుగుల వేయబోతున్న రాజ్ తరుణ్ సినీ కెరీర్ మాత్రం ఇటీవల అంత ఆసక్తికరంగా లేదనే చెప్పాలి. వరుస పరాజయాలతో విసిగిపోయిన ఈ యంగ్ హీరో ప్రజంట్ దిల్ రాజు బేనర్ లో `ఇద్దరి లోకం ఒక్కటే` సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాతో అయినా రాజ్ తరున్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి మరి.