ప్రభాస్ మూవీపై రాహుల్ రవీంద్రన్ కీలక వ్యాఖ్యలు..నటిస్తున్నాడని కన్ఫార్మ్ అయ్యింది
on Jun 11, 2025
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)హను రాఘవపూడి(Hanu Raghavapudi)కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 1940 వ సంవత్సరంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా 'ఫౌజీ'(Fouji)అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ(Imanvi)హీరోయిన్ గా చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. చిత్రీకరణ కూడా ప్రారంభమైన ఈ మూవీపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ మూవీలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు. ఈ విషయాన్నీ చిత్ర బృందం వెల్లడి చెయ్యకపోయినా, స్వయంగా రాహుల్ రవీంద్రన్ నే చెప్పడం విశేషం రీసెంట్ గా రాహుల్ రవీంద్రన్ ఒక విభిన్నమైన లుక్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ హను రాఘవపూడి సినిమాలో చేస్తున్నాను. అందుకే ఈ లుక్ ని కొనసాగిస్తున్నాని చెప్పుకొచ్చాడు.
తమిళ చిత్ర సీమకి చెందిన రాహుల్ రవీంద్రన్ 2010 లో తమిళంలో తెరకెక్కిన 'మాస్కో విన్ కావేరి' అనే చిత్రంతో హీరోగా తన సినీ జర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత తెలుగులో అందాల రాక్షసి, పెళ్లి పుస్తకం,అలా ఎలా' వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించడంతో పాటు పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. చిలసౌ మూవీతో దర్శకుడుగా మారి ప్రస్తుతం రష్మిక టైటిల్ రోల్ లో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
